శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
366)హేతుః -

సృష్టి కారణమయినవాడు
సర్వముకు హేతువైనవాడు
అంతయు నడుపుచున్నవాడు
కార్యకారణమైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
367)దామోదరః -

దమాది సాధనలున్నవాడు
ఉదారబుద్ధినిచ్చు వాడు
విష్ణువుగా నున్నట్టివాడు
దామోదర నామమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
368)సహః -

సహనము కలిగినట్టి వాడు
సహవాసము జేయువాడు
తోడుగా తాను ఉండినవాడు 
సహాయము చేయగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
369)మహీధరః -

భూమిని ధరించినవాడు
ధరణిని ఉద్ధరించినవాడు
ప్రకృతిని నిలుపుచున్నవాడు
జీవులకు రక్షణయైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
370)మహాభాగ్యః -

సిరిసంపదలు ఇచ్చువాడు
భాగ్యవంతుడు తానైనవాడు
ధనలక్ష్మిని కలిగియున్నవాడు
సంపదల కారణమైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు