సుప్రభాత కవిత ; - బృంద
మేటవేసిన మంచులాటి
మమతలేవో కరిగిపోతూ
కనులదారిని సాగిపోతూ
మదిని ఊయలూపువేళ...

శిలల లాగా మారిన 
కలవరించిన కోరికలను
అలల లాగా సన్నగ తాకుతూ
కదలికలేవో కలిగించువేళ..

తెలియని నమ్మకమేదో
చేయిని వీడకుండా
నీడలా తోడుగా
నాతోనే  నిలిచిన వేళ..

దిక్కు తెలియని చీకటిలో
మొక్కుకున్న దైవమొచ్చి
చిక్కుముడుల దారులన్నీ
చక్కగ తిన్నగ సరిచేయువేళ

గుండె నిండిన సందడేదో
పండుగల్లే సంబరపడేలా
ఎండిపోయి వడలిన మదికి
ఏరువాక  కదిలి వచ్చు వేళ...

కనుల నిండిన మెరుపులా
కాంతి రేఖల మిరుమిట్లతో
కొత్త ఆశల కిరణాల తేరును
ముంగిటిలో నిలిపిన వేళ

ముకుళిత హస్తాల వందనమిస్తూ

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు