పోటీ తత్వం; - సి.హెచ్.ప్రతాప్
 దేశవ్యాప్తంగా సామాజిక వాతావరణంలో పోటీతత్వం రోజు రోజుకు పెరిగిపోతొంది. చదువుల్లో, పోటీ పరీక్షల్లో, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో, ఉద్యోగ పదోన్నతుల్లో ఈ పోటీ సర్వసాధారణంగా మారిపోయి అనేకానేక మానసిక ఉద్వేగాలకు తెరలులేపుతోంది! ఈ పోటీను ఎదుర్కోలేక ఎందరో విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్న విషయం మనకు మీడియా ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యకరమైన పోటీ తత్వం అవసరమైన విషయమే కానీ అనవసర పోటీతత్వంతో మనల్ని ఇతరులతో పోల్చుకుంటూ మనల్ని మనం తక్కువ చేసికోవటంలోనే అసలు సమస్యలనేవి ప్రారంభం అవుతాయి. మొదట్లో చిన్నగా ప్రారంభమైన ఈ పొటీతత్వం రాను రాను ఒక పెద్ద సమస్యగా మారుతోంది.దీనికి ముఖ్యమైన కారణం మన కంటే కూడా ఇతరులపైనే మన అంచనాలను ఎక్కువగా పెంచుకొని మనల్ని మనం తక్కువగా చూసుకోవడం.ఇతరులకంటే ఉన్నతంగా వుండాలను కోవటం ఉన్నతంగా ఎదగాలను కోవటం తప్పులేదు! తప్పు కాదు! కానీ లక్ష్య సాధనలో మనలోవున్న అనుకూల లక్షణాలు తక్కువ చేసుకొని ఇతరులలో అవి ఎక్కువగా వుంటాయనుకునే భ్రమలే మన మనసులను అనవసర ఇబ్బందులకు గురిచేస్తుంది.పోటీ తత్వం మంచిదే కానీ నిన్ను , నీ నైపుణ్యాన్ని మెరుగు పరుచుకో అదే నిన్ను ముందు వరుసలో నిలబెడుతుంది. పోటీ అనుకున్న వాళ్ళని అందరి ముందు విలువ తగ్గిస్తే అది నీ విలువ పెంచదు. గుర్తుపెట్టుకో. నిజమైన స్నేహితుల మధ్య పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉంటుంది. కానీ నకిలీ స్నేహితులు  తమ స్నేహితులతో పోటీని ఆరోగ్యకరంగా కాకుండా అహంకారంతో స్వీకరిస్తారు. ఎప్పుడూ తనే నెగ్గాలనే ఆలోచనతో ఉంటారు. కొన్ని సార్లు పోటీలో గెలవడానికి స్నేహాన్ని అయినా వదలడానికి వెనుకాడరు.
కామెంట్‌లు