మహామనీషి శ్రీ హరికృష్ణ జోషి -అచ్యుతుని రాజ్యశ్రీ
 ఆయన్ని అంతా అప్పాజీజోషీ అని పిలిచేవారు.30మార్చి 1897 లో పుట్టిన ఈయన డాక్టర్ హెడ్గెవార్ కి కుడిభుజం గా విదర్భ ప్రాంతంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి సేవలందించారు.వారికులవృత్తి పౌరోహిత్యం.హరి 12 వ ఏట తండ్రి ముగ్గురు సోదరులు చనిపోయారు.తల్లి తమ్ముడు తో 10వక్లాస్ దాకా చదివిన ఆయన పురోహితులు గా మారి సంసారం ఈదారు.తిలక్ ని చూట్టానికి 10ఏళ్ళచిన్నారి  రైల్వే స్టేషన్ కి వెళ్లాడని అధ్యాపకుడు బెత్తంతో చితకబాదాడు.5వజార్జి చక్రవర్తి రాకకు నిరసన తెల్పాడని హైస్కూల్ నుంచి బహిష్కరించారు.14 ఏళ్ల కే పెళ్ళి పౌరోహిత్యం తో పాటు వ్యాయామశాల నడిపారు.గణేష్ మండల్ పేరు తో క్రికెట్ క్లబ్ ఓనాటక సమాజంని నెలకొల్పి ఆర్.ఎస్.ఎస్.వ్యాప్తికి ఆయన చేసిన కృషి ఫలించింది.20 ఏళ్ల వయసులో వార్తా అంతా హోం రూల్ ఉద్యమం తిలక్ భక్తుల తో నిండింది అంటే జోషీజీ ప్రతిభయే కారణం.స్వయంగా చరఖాలు తయారు చేయించి చౌకగా అమ్మడం అన్ని గ్రామాల్లోకి ఏకులు ఖద్దరు సరఫరా హరిజనోద్ధరణ మద్యపాన నిషేధం పారిశుధ్యం పై ఆయన కృషి నభూతో నభవిష్యతి.జైలు నుంచి విడుదలైన ఆయన్ని కులబహిష్కారం చేయడంతో పౌరోహిత్యం పోయింది.1931 లో అటవీ సత్యాగ్రహం లో సి.. శ్రేణిలో ఉంచడంతో ఆరోగ్యం దెబ్బతింది.స్పృహకోల్పోతే బి..బారక్స్ లో కి మార్చారు.1975 లో ఎమర్జెన్సీ కాలంలో ఆర్.ఎస్.ఎస్.కార్యకర్తలని అందర్నీ ఇందిరాగాంధీ జైల్లో పెట్టడంతో పాపం జోషీ అప్పాజీకి 79 ఏళ్ల వయసులో ఆశిక్షతో ఆరోగ్యం దెబ్బతింది.21 డిసెంబర్ 1979లో ఆయన మరణించారు.ఆఖరి రోజుల్లో తమ కులదైవం మంగుళూరు మాత దర్శనం శుక్రవారం వ్రతం శ్రీవెంకటేశ్వర పారాయణ పూర్తి చేసిన పుణ్య మూర్తి.స్వాతంత్ర్య వీరులకు లభించే పెన్షన్ తామ్రపత్రాలు నిరాకరించిన అభిమానధనుడు హరేకృష్ణ హరేకృష్ణ అని దైవ స్మరణ చేస్తూ ప్రాణత్యాగం చేసిన ఆ మహనీయుని జీవితచరిత్ర చదువుతుంటే కన్నీరు ఆగదు సుమా🌷
కామెంట్‌లు