హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 67.
ఉత్పలమాల.
సాధనలేమి చేసెనట? సామజ మేడ్వగ వచ్చితీవు నిన్
శోధన జేసెనా మరి యశోదకుఁ జూపితి వెల్లలోకముల్
క్రోధము జూపినన్ భృగువుఁ గొల్చిన వాడవు నిన్ను దల్చు మా
బాధలఁ దీర్పవయ్య!తగువారముకామ? కృపాకరా!హరీ!//

68.
ఉత్పలమాల.
ముచ్చటగా సిరిన్ గనుచు మోహపు నవ్వులు చిల్కువాడ!మే
మిచ్చట కష్టముల్ పడుచు నేదరిఁ గానక దుఃఖమొంది వే
వచ్చితి మయ్య!నీ గిరికి బాధలు తీర్పగ దైవమీవె!మా
నెచ్చెలికాడవంచు నిట నిల్చిన మమ్ముల గాంచుమా హరీ!//
కామెంట్‌లు