ముంతెడు గంజి;- ఎడ్ల లక్ష్మి
ముత్తయ్య తాత వచ్చాడు
ముంతెడు గంజి తెచ్చాడు
మోతుకాకులు తెచ్చాడు
చిన్నగా దోప్పలు కొట్టాడు !!

సత్తయ్య తాతను పిలిచాడు
దొప్ప చేతికి ఇచ్చాడు
అందులో గంజి పోసాడు
అతడు బొజ్జనిండా తాగాడు !!

గోనయ్య తాత వచ్చాడు
రెండు గొంగళ్ళు తెచ్చాడు
వారిద్దరికీ ఇచ్చాడు
చెట్టు కింద పరిచారు !!

ఇద్దరు నడుము వాల్చారు
చల్లాటి గాలి వీచింది
చెట్టు పైకి చూసుకుంటూ
హాయిగా నిద్రపోయారు !!

కిట్టయ్య తాత వచ్చాడు
కేక వేసి పిలిచాడు
కేక విన్నా వారిద్దరూ
గబగబ లేచి వెళ్లారు !!

కామెంట్‌లు