396)విరతః -
విషయవాంఛలు లేనివాడు
కోరికలకు దూరమునున్నవాడు
విరాగిగా చరించుచున్నవాడు
విమలత్వము కలిగినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
397)మార్గః -
మోక్షమార్గము చూపించువాడు
సరియైన త్రోవనిచ్చు వాడు
భక్తులకు సుపథమునిచ్చువాడు
దారి తానే అయినట్టివాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
398)నేయః -
ఆత్మజ్ఞానము ప్రసాదించువాడు
నెమ్మిక కలిగించుచున్నవాడు
ధర్మమును కాపాడువాడు
స్నేహం అల్లుకున్నట్టి వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
399)నయః -
జీవులకు గమనమునేర్పువాడు
విశ్వమును నడిపించుచున్న వాడు
పరమపదముకు చేర్చగలవాడు
సత్యమార్గం తానుగానున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
400)అనయః -
తనకు సారధి లేనట్టివాడు
నడిపించువారు లేనివాడు
తన వర్తనము తానేయగువాడు
స్వయంసారధ్యము వహించువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి