శ్రీవిష్ణు సహస్రనామాలు బాల పంచపది ఎం. వి. ఉమాదేవి
406)పురుషః -

సాంఖ్యజీవుడు తానైనవాడు
పురుషాకృతి ధరించినవాడు
పరమాత్మ స్వరూపమున్నవాడు
పురుషోత్తమ లక్షణమున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
407)ప్రాణః -

చేష్టలను కలిగించుచున్నవాడు
కర్మకారణ చేతననీయువాడు
జీవధాతువు తానైనవాడు
ఉసురును నిల్పుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
408)ప్రాణదః -

ప్రాణమునిచ్చుచున్న వాడు
జీవశక్తి కారణమైనవాడు
చైతన్యపు రూపునిచ్చువాడు
ప్రాణము ప్రసాదించుచున్నవాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
409)ప్రణవః -

ఓంకార స్వరూపమున్నవాడు
ప్రణవనాదము తానైనవాడు
తొలి ధ్వనిగా యున్నట్టివాడు  
ఉచ్ఛారణలో దివ్యమైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
410)పృథుః -

ప్రపంచరూపములో నున్నట్టివాడు
విశ్వమంతటనూ దాగినవాడు
విస్తరణతత్వం కలిగినవాడు
భూమిని ఆక్రమించినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు