మానవత్వం - సి.హెచ్.ప్రతాప్
 మానవతను ఉపాసించలేని
యధాయోగ్యం గా వ్యవహరించలేని
పరిశుద్ధ మనసుతో  పవిత్రంగా
స్వార్ధరహితంగా సాటి వారిని
ప్రేమించలేని జీవితం నిరర్ధకం
పరులతో శాంతంగా, సరళంగా
ప్రేమతో ధర్మ బద్ధంగా
వ్యవహరించుట అత్యావశ్యకం
మనశ్శాంతి, ఆత్మ తృప్తి ప్రాప్తం
సమాజ శాంతి స్థాపన తధ్యం
మానవత్వం ఉపాసించిన జీవితం
పువ్వుల వలె రంగురంగులగా
ఉదయపు సూర్యుడిలా ప్రకాశవంతం
సంస్కృతి సాహిత్య సంప్రదాయలలో
మానవతా విలువలు వెల్లివిరిసి ప్రతిబింబిస్తాయి
జాతి ఔన్నత్యానికి ఆసరాగా నిలుస్తాయి
ఆపదల్లో కొట్టుమిట్టాడేవారికి ఊతను
ధైర్యాన్ని ఆశను, ఆత్మవిశ్వాన్ని
వ్యక్తిత్వ పరిమళాలనందించేదే మానవత్వం
సొంత లాభం కొంతమానుకో,
పొరుగువారికి తోడుపడవోయ్
గురజాడ వారి వాక్యం అనుసరణీయం 
కామెంట్‌లు