సుప్రభాత కవిత ; బృంద
మంచుతెరల పరదాల
జలతారు జలరేఖలు
ఏడురంగులు కలగలిపిన
పాలమబ్బుల సోయగాలు

విరిసే సమయం వస్తే చాలు
వసంతం రానక్కర్లేదు
మురిసే నవ్వుల గుమ్మరించే
ముగ్ధ మోహన కుసుమబాలలు

పెనవేయు పొగమంచు
పరిష్వంగంలో 
పరవశించిన గిరి శిఖరాల
సొగసులు
తెర తొలగి వెలుగులు
ప్రసరించు సమయాన

పరిమళాలు వెదజల్లు
ప్రసూనమ్ముల చూచి
పరుగుపరుగున చేరు
ప్రభాకర కిరణాల ప్రాభవాలు

ప్రాగ్దిశను మొదలై 
ప్రసరించు కాంతుల ప్రభలు 
పృధ్వి చేరి అణువణువూ
అనురాగము ప్రకటింప

తరలి వచ్చు తొలిపొద్దుకు
తలవంచి జోతలతో

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు