మరుగున పడిన మాణిక్యం... అచ్యుతుని రాజ్యశ్రీ
 పద్మవిభూషణ్ మాధవశ్రీహరిగారి గురించి చదివాక మరుగునపడిన దేశ భక్తులగూర్చి ఆవేదన బాధ కల్గుతుంది.కొందరిపేర్లు మాత్రమే అందరినోళ్లలో మారుమ్రోగటం  మీడియా కూడా పదేపదే వారిని హైలైట్ చేయడం దౌర్భాగ్యం.29.8.1880 లో పుట్టిన తెలుగు బిడ్డ సంస్కృతపండిత కుటుంబంకి చెందిన ఆయన పూర్వీకులు అన్నంరాజు అనే ఇంటిపేరు గలవారు మహారాష్ట్ర లో స్థిరపడ్డారు.ఇంటిపేరు ఆణేగా మారడంతో  అంత గుర్తింపు పొందలేదేమో ? కనీసం పాఠ్యపుస్తకాల్లో ఉండరు ఇలాంటి మహానుభావులు!?
కలకత్తా లో చదివి న్యాయ వాది గా రెండు చేతులతో డబ్బు సంపాదించే ఆయన రచయిత కూడా. విదేశీ వస్తుబహిష్కరణతో పాటు యువతకు ప్రోత్సాహం ఇవ్వాలి అని ఆయన వాదన.హోంరూల్ ఉద్యమం తోపాటు గణపతి ఉత్సవాలు శివాజీ జయంతులు జరిపారు.రాజ్యాంగరచన కమిటీ కి కార్యదర్శిగా పనిచేశారు.మాలవ్యాతో కలిసి కాంగ్రెస్ నేషనల్ పార్టీని నెలకొల్పి 1935లో సెంట్రల్ అసెంబ్లీలో అరంగేట్రం చేశారు. శ్రీలంకలో హైకమీషనర్ గా వెళ్లి బౌద్ధమతం నిగూర్చి క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.బౌద్ధభిక్షువులకి విరాళాలు సేకరించారు.1947 లో రాజ్యాంగ పరిషత్తు లో ఆయన మేథ అనుభవం తోడ్పాటు అమోఘం.1948 లో బీహార్ గవర్నర్ గా ఆంగ్లేయుల పద్ధతులు రద్దుచేశారు.ఒక కార్యకర్త గా గవర్నర్ గా కూడా అందుబాటులో ఉన్న వాహనాలు ఒంటె ఎడ్లబండి పై పయనించారు అని చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది.విదర్భ సాహిత్య సంఘస్థాపన మరాఠీసాహిత్యసమ్మేళనాల నిర్వహణ లో ఇటు రాజకీయాలు అటు సాహితీ రంగంలో సవ్యసాచి గా భాసిల్లారు.1950_1967వరకు ఎం.పీ.గా అస్పృశ్యత పాటించని నిస్వార్థ నాయకుడు మహారాష్ట్ర కట్టుతో నెత్తిన తలపాగా తో ఆకర్షణీయంగా కన్పించే వారు.ఆయనకి సన్మానాలు సత్కారాలు జరిగినా 30వేల రూపాయలు బహూకరించినా  అనేక సంస్థలకు విరాళంగా ఇచ్చేవారు.సంస్కృతంలో 16 వేల శ్లోకాలు 85 అధ్యాయాలలో " తిలక్ యశోర్ణవం" అని లోకమాన్యుడిపై రాసిన గ్రంథం అకాడమీ బహుమతి పొందింది.26.1.1968 లో పరమపదించారు.రిపబ్లిక్ డే కావడంతో ఈయన వర్థంతి రోజు మరుగున పడింది ఏమో!?🌷
కామెంట్‌లు