భయం!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
మాట్లాడుదామంటే భయం
ప్రేమిద్దాం అంటే భయం 
విడిపోదామంటే భయం
కలహం అంటే భయం!!!!!

చీకటి అంటే భయం
లోతు అంటే భయం
ఎత్తంటే భయం
నడుద్దాం అంటే భయం
పరిగెత్తుదామంటే భయం!!!

ఒంటరితనం అంటే భయం
సమూహం అంటే భయం
ఎగురుదామంటే భయం
స్వారీ చేద్దామంటే భయం
చనిపోవడం అంటే భయం
మంటలంటే భయం-నీరంటే భయం!!!?

విచిత్రం ఏమిటంటే ఇన్ని భయాలు ఉన్నా కూడా
భయపెట్టడం కష్టం కానీ
భయాన్ని పోగొట్టడం కష్టం కాదు!!!

నీవు ఉన్నా లేకున్నా నీవు జన్మించిన జన్మించకున్నా!!?
లోకం ఉంటుంది పంచభూతాలుంటాయి
భూమి ఉంటుంది సూర్య చంద్రులు ఉంటారు.!!!
ఇక భయమెందుకు అంటున్నది మనసు!!?

ఉంటే లాభం లేకుంటే నష్టం
ఉంటే అనుభవిస్తావు లేకుంటే అనుభవించవు‌.
ఉంటే అదృష్టం లేకుంటే దురదృష్టం!!!?

ఈ లోకంలోకి ఎలాంటి పెట్టుబడి లేకుండానే 
వచ్చావు. నచ్చితే ఉండు లేకుంటే లేదు.
అని అంటున్నది ఆలోచన!!!!?
భయపెట్టడం కష్టం కానీ
భయాన్ని పోగొట్టడం చాలా తేలిక!!!!!?

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
కామెంట్‌లు