జిల్లాస్థాయి పోటీలో మడిపల్లి కాలనీ విద్యార్థి ప్రతిభ
 కాల్వశ్రీరాంపూర్ మండలం మడిపల్లి కాలనీలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి ఎ. మన్విత్ జిల్లా స్థాయిలో నిర్వహించిన ఏకపాత్రాభినయం పోటీలో అత్యంత ప్రతిభ కనబరిచారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆధ్వర్యంలో శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నేషనల్ గ్రీన్ కోర్ (ఎన్జిసి) ఎకో క్లబ్ సభ్యులైన విద్యార్థినీ, విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. డ్రామా, మోనో యాక్షన్ విభాగాల్లో, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో మడిపల్లి కాలనీ విద్యార్థి మన్విత్ అత్యంత ప్రతిభ కనబరిచి, మూడవ స్థానంలో నిలిచారు. విద్యార్థికి చక్కటి శిక్షణనిచ్చి జిల్లా స్థాయిలో ప్రతిభను కనబరిచేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న గైడ్ టీచర్ మారెపల్లి జ్యోతిని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరారెడ్డి,  ఇతర ఉపాధ్యాయినులు అభినందించారు. అత్యంత ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయిలో నిలిచిన మన్విత్ ను మండల విద్యాధికారి ఆరెపల్లి రాజయ్య, ఎఫ్ఎల్ఎన్  మండల నోడల్ అధికారి సిరిమల్ల మహేష్, ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, మడిపల్లి కాలనీ పాఠశాల హెచ్.ఎం వీరారెడ్డి, ఉపాధ్యాయినులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యా కమిటీ చైర్మన్, సభ్యులు, పలువురు అభినందించారు.
కామెంట్‌లు