ఆరనిజ్వాల- డా.రామక కృష్ణమూర్తి-బోయినపల్లి,సికింద్రాబాద్.
 దాగిన విషయమేదో  మదిన సలుపునపుడు,
వ్యూహరచనయేదో చిత్రపటమువోలె మెదలునపుడు,
అంతకంతకు బాధ ఆవరించి
చింతను రాజేయునపుడు,
భవిష్యత్తు ముఖచిత్రాన్ని నిర్విరామంగా అంచనా వేయునపుడు,
కర్తవ్యనిర్వహణ యందు
తలమునకలుగా ఆలోచన సేయునపుడు,
జీవితాన ముఖ్యనిర్ణయాన్ని 
నేర్పుగా తీసుకొనునపుడు,
ఆకాశమే హద్దుగా విజయాన్ని చేజిక్కించుకొని మురియునపుడు,
కష్టమైనను,సుఖమైనను ,
ఆనందమైనను,విషాదమైనను
సందర్భమేదైనా మదింపు
కొనసాగుచునేయుండును.
మానవాళి మస్తిష్కమునందు
కొత్త ఆవిష్కరణలకు అంకురార్పణ జరుగుచూనే యుండును.
కామెంట్‌లు