శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
461)మనోహరః -

మనసులను హరించుచున్నవాడు 
ఇంపైనట్టి రూపమున్నవాడు 
బంగారము వంటిమెరుపున్నవాడు 
మనోజ్ఞమైన దివ్యతున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
462)జితక్రోధః -

కోపమును జయించినట్టివాడు 
జితక్రోధుడై యుండినవాడు 
కినుకవహించుట లేనివాడు 
క్రోధాగ్నిని చల్లార్చగలవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
463)వీరబాహుః -

శక్తివంతమైన కరములున్నవాడు 
అనేక బాహువులున్నట్టి వాడు 
పరాక్రమము చూపించువాడు 
వీరత్వము ప్రదర్శించగల వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
464)విదారణః -

దుష్టులను చీల్చిచెండాడువాడు 
యుద్ధము చేయగలిగినవాడు 
విదారణము చేయుచున్నవాడు 
శత్రువులనోడించగల వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
465)స్వాపనః -

తనమాయలో ముంచుచున్నవాడు 
ప్రాణులను నిదురింపజేయువాడు 
అజ్ఞానములో ముంచగలవాడు 
శయనములో పడద్రోయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
[1:11 pm, 28/03/2024] Umadevi Nelluru: శ్రీ విష్ణు సహస్రనామాలు 
ఎం. వి. ఉమాదేవి 
(బాల పంచపది )28-3-2024

466)స్వవశః -

తనకి తానే వశమైనట్టివాడు 
అంతర్యామిగా నుండినవాడు 
లీనస్వభావమున యున్నవాడు 
అంతర్గతభావన గలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
467)వ్యాపీ -

సర్వత్రా వ్యాపించియున్న వాడు 
విశ్వవ్యాప్తంగా నున్నట్టివాడు 
ప్రకృతిగా అలరించుచున్నవాడు 
పంచభూతములలో నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
468)నైకాత్మా- 

అనేకరూపాలలో నున్నవాడు 
సర్వప్రాణులును తానయినవాడు 
అవతారములు దాల్చుచున్నవాడు 
సర్వాత్మకుడై విరాజిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
469)నైకకర్మ కృత్ -

సృష్టికర్మలో నిమగ్నమైనవాడు 
స్థితిని నిల్పుచున్నట్టి వాడు 
లయమును చేసుకోగలవాడు 
అనేకక్రియలు తానేచేయువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
470)వత్సరః -

సర్వులకు నివాసమైనవాడు 
ఏడాదియే తానైనట్టి వాడు 
కాలనిర్ణయం చేయగలవాడు 
వాత్సల్యరూపుడై యున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు