శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
381)వికర్తా -

విచిత్రవిశ్వము చేసినవాడు
సమస్త సృష్టికర్తయైనవాడు
లోక సృజన చేయునట్టివాడు
విశ్వచిత్రమును రచించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
382)గహనః -

గ్రహించలేని శక్తిగలవాడు
గుర్తింపును ఎరుగనివాడు
ఎరుగ శక్యముగానట్టివాడు
ఎంచలేని ఘనతలున్నవాడు 
 శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
383)గుహః -

ఎన్నడు వ్యక్తము కానట్టివాడు
కప్పబడినట్టి మహిమున్నవాడు
మాయచే కమ్మినట్టి వాడు
గుప్తముగా నుండగలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
384)వ్యవసాయః -

మానవాభ్యున్నతిజేయువాడు
అభివృద్ధికి కృషిసల్పువాడు
నరులకు సాయపడువాడు
శ్రామికజీవితం తెలిసినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
385)వ్యవస్థానః -

సర్వమును నడిపించేవాడు 
వ్యవహారములు చక్కబెట్టువాడు
వ్యవస్థను పరికించినవాడు
వ్యవస్థలను నిలుపువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు