శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ; కొప్పరపు తాయారు
 🍀  శ్రీ శంకరాచార్య స్తోత్రం🍀

వార్థక్యే చేన్ర్దియాణాం వికల గతి మతశ్చాది దైవాది 
తా పైః
ప్రాప్తై రోగై ర్వియోగైః  వ్యసన కృశతనోర్జ్ఞప్తి హీనంచ
దీనం!
మిధ్యా మొహాభిలాషైర్బ్రమతి మమ మనోదూర్జటే
ర్ద్యాన సూన్యం !
క్షన్తవ్యో మేపరాధః, శివ శివ శివ భోః
   శ్రీ మహాదేవ శంభో!!

4) ముసలి తనము నందు ఇంద్రియములు పని చేయక తాపత్రయము చే సంప్రాప్టించిన రోగములతోనూ , బంధు జన వియోగములతోనూ,
నా శరీరము కృశించి పోయినది .
మనసు జ్ఞాపక శక్తిని కోల్పోయి దీనమై అసత్యములైన ఆశలతో భ్రమించుచూ పరమేశ్వరుని
ధ్యానించుట లేదు. శ్రీ మహాదేవా! శంభో! నా అపరాధమును క్షమించుము.
కామెంట్‌లు