జంట చిలుకలు;- ఎడ్ల లక్ష్మి-సిద్దిపేట
రావే రావే రామచిలుక
కోవా బిస్కెట్ తెచ్చాను
కొసిరి కొసిరి తినవమ్మా
చిగురు కొమ్మల్లో దాగమ్మా

తోటి చిలుక వస్తుంది
పాట పాడి పిలుస్తుంది
ఆటలాడ చూస్తుంది
దరికి నీవు రాకమ్మ

కిలకిల పలికే చిలకమ్మా
వేట చేయ వచ్చాడు
చెట్టు కింద వల వేశాడు
తోటి చిలుకకు చెప్పమ్మా

జంటగా మీరు దాగండి
వాడి కంట పడకండి
కుడి ఎడమలై నిలవండి
కూడి జంటగ ఉండండి

రేయి పగలు గడపండి 
రేపటి రోజున చూడండి
మేతకు మీరు వెళ్ళండి
మీ పిల్లల బొజ్జ నింపండి

కామెంట్‌లు