మన పల్లెలు--సి.హెచ్.ప్రతాప్
 కల్లాకపటం లేని కల్మషమసలే అంటని
ఆత్మీయతానురాగాల పొదరిల్లు
పచ్చని పంటపొలాలు
ముచ్చటగొలిపే బంధుత్వాలు
అచ్చమైన ఆనందాల హరివిల్లు
నిత్యం జీవ కళతో నవనవ లాడుతుంటాయి
జవ సత్యాలతో, ఆనందోత్సాహాలతో
విలసిల్లే మన పల్లెలు దేశానికే పట్టుగొమ్మలు
సూరీడి తూర్పు వాకిలి తెరవకముందే
పక్షుల కిలకిలరావాలు మొదలవకముందే
మొదలౌతుంది మన పల్లె జీవితం
కళ్ళాపితో వాకిళ్ళు తలంటుకుంటాయి
ముత్యాల ముగ్గులతో సింగారించుకుంటాయి
బాంధవ్యాలు ఏరులై పేరుతూ
ఆప్యాయంతో పలకరింపులు
పల్లె ప్రగతి జగతికి వెలుగు.
పల్లెల స్వయంపరిపాలన స్వావలంబనకు కొలమానం
కామెంట్‌లు