శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
361)లక్ష్మివాన్ -

సదాలక్ష్మిని కలిగియున్నవాడు
వక్షస్థలంలో ధరించినవాడు
శ్రీకరములను ఒసగువాడు 
లక్ష్మినివాసమందున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
362)సమితింజయః -

యుద్ధమందున జయించువాడు
సమూహమును గెలుచువాడు
విజయమును పొందినట్టివాడు
నాయకుడయినట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
363)విక్షరః -

నాశములేనట్టి వాడు
క్షరమన్నది ఎరుగనివాడు
ధ్వజమువలే ఎగురువాడు
విక్షరమగునట్టి రూపువాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
364)రోహితః -

మత్స్యరూపం ధరించినవాడు
కేసరి మృగమురూపువాడు
అగ్ని సమానుడైనట్టివాడు
మోదుగపువ్వులా ఎర్రనివాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
365)మార్గః -

భక్తులుతరించు మార్గమైనవాడు
సత్యమార్గమును చూపువాడు
మార్గము సుగమముజేయువాడు
దారిదీపమై బాసిల్లువాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు