శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
 346)పద్మనాభః -
పద్మము నాభియందున్నవాడు
బ్రహ్మపుట్టుక కారణమైనవాడు
బొడ్డునందు కమలమున్నవాడు 
పద్మనాభుడై యున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
347)అరవిందాక్షః -
కమలముల కన్నులున్నవాడు
విశాల నేత్రాలున్నట్టి వాడు
అరవిందనేత్రములవాడు
తామరపూలనేత్రములవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
348)పద్మ గర్భః -
పద్మగర్భమున నివసించువాడు
స్వచ్ఛమైన ప్రదేశమునున్నవాడు
తామరతూడులమధ్యనున్నవాడు
శ్రీ హరియే ప్రకృతి యైనవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
349)శరీరభృత్ -
ప్రాణులను పోషించువాడు
శరీరములను రక్షించువాడు
జీవనభృతి నిచ్చుచున్నవాడు
శక్తిని కలిగించుచున్న వాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
350)మహర్షిః -
మహావిభూతులుగలవాడు
ఋషితత్వమున్నట్టి వాడు
తాపసివలే మెలుగుచున్నవాడు
గొప్ప తేజము గలిగినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
కామెంట్‌లు