రాష్ట్రపతి నిలయంలొ కవి సమ్మేళనం: ;- - మణి నాథ్ కోపల్లె
 రాష్ట్రపతి నిలయం, బొల్లారం లొ ఆదివారం   అంతర్జాతీయ మహిళా దినోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. హైదరాబాదు నగరం నుంచే కాదు తెలంగాణా రాష్ట్రం లోని ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీం నగర్, వంటి జిల్లాల నుంచి కూడా దాదాపు రెండువందల మంది  రచయిత్రులు, కవయిత్రులు    ఈ  లిటరరీ ఫెస్ట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంత పెద్ద కార్యక్రమానికి రథ  సారధి అయిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి అయినంపూడి  శ్రీలక్ష్మ ఆధ్వర్యంలో ఇంతమంది రచయిత్రులు  ఒక చోట చేరారు.   సీనియర్ రచయిత్రులు డా . మంథా  భానుమతి, గంటి భానుమతి, వారణాసి నాగలక్ష్మి, పీయస్ లక్ష్మీ, చాగంటి కృష్ణ కుమారి వంటి వారు, గురజాడ శోభాపేరిందేవి, ఉప్పలపాటి కుసుమ, కోపెల్ల  మణి,  విశ్వైక , యశోద లతో పాటు (అందరి పేర్లు రాయలేను కనుక కొంతమంది పేర్లే రాయటం జరిగింది. )  ఎందరో ప్రముఖ రచయిత్రులు పాల్గొన్నారు.  ఎంతో కన్నుల పండుగగా కవి సమ్మేళనం జరిగింది. మహిళాభ్యుదయం మీద కవితలు, పాటలు, గజల్స్ స్వీయ రచనలతో అలరించారు.  ఇంకో విశేషం ఒక్క తెలుగు భాషలో మాత్రమే కాదు హిందీ, సంస్కృతం, ఇంగ్లీషు,  కన్నడ, మరాఠీ,వంటి ఇతర భాషలలొ కూడా సవేయారచనాలను గానం చేశారు.  ఈ కార్యక్రమం చక్కని పచ్చని తోటలో చక్కని గాలులు వీస్తూండగా ఆహ్లాద వాతావరణంలో జరిగింది.            మేనేజర్ రజనీప్రియ గారు రచయిత్రులందరినీ చక్కని పచ్చని  మొక్కలతో రచయిత్రులను సత్కరించారు.  అనంతరం అందరూ రాష్ట్రపతి నిలయం లొ వున్న ఇతర ప్రదేశాలు చూశారు. కొత్తగా ఏర్పాటు చేసిన గడియారం చాలా బాగుంది.  అక్కడ జరుగుతున్న హాండీ క్రాఫ్ట్స్ ఎక్జిబిషన్ లొ  షాపింగ్ చేసే వారు చేశారు. అందరికీ విందు భోజనాలు ఏర్పాటు చేశారు. అందరికీ ఇదో మరపురాని అనుభూతి. 
*******************************************
-- విశాలమైన రాష్ట్రపతి నిలయంలో చూడవలసినవి ఆర్ట్ గ్యాలరీ, రాక్ గార్డెన్, నక్షత్ర గార్డెన్, హెర్బల్ గార్డెన్ బ్యాటర్ఫ్లీ గార్డెన్, అమ్మవారి గుడి, ఇలా ఎన్నో సుందరమైన ప్రదేశాలు చూడచ్చు.మన దేశ రాష్ట్రపత్తు గౌ।। శ్రీమతి దౌపది ముర్ము గారు నగరానికి వచ్చినపుడు విడిది చేసే ప్రదేశం.  ఢిల్లీ తరువాత సౌత్ ఇండియాలో మన హైదరాబాదు నగరం లో మాత్రమే వుంది.
కామెంట్‌లు