శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ;- కొప్పరపు తాయారు
🍀  శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀

బాల్యే దుఃఖాతి రేఖాన్మలలులిత  వపుః
స్తన్యపానే పిపా‌సుః
నా శక్త శ్చేన్ద్రియే భ్యో భవ మల  జనితా జన్త వో 
మాం తుదన్తిః
నానారోగాతి దుఃఖాద్రుణిత పరవశః  శంకరం న స్మరామి
క్షన్తవ్యో  మేపరాధః ,శివ  శివ శివ భోః
   శ్రీ మహా దేవ శంభో!
  
పసితనము నందు మిక్కిలి దుఃఖము ననుభవించి,
మలములో దొర్లుచూ పాలు తాగదలిచి ఇంద్రియములను కదిలించుటకు కూడా శక్తి లేని వాడ నైతిని, మలము నందు పుట్టు పురుగులును,
నన్ను వీడించుచున్నవి.
     నానా రోగములచే దుఃఖితుడనై పరాధీనుడనై 
శంకరుని స్మరించ లేకుంటిని. శ్రీ మహాదేవా! శంభో!
నా అపరాధమును క్షమింపుము !
                     ***🪷***
🍀 తాయారు 🪷
కామెంట్‌లు