కవితాదినోత్సవం నాడు ఒంగోలులో శ్రీ గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్ కు సన్మానం
 కళామిత్రమండలి, ఒంగోలు వారి ఆధ్వర్యంలో కవితాదినోత్సవ సందర్భాన మల్లయ్య లింగం భవనములో కవిసమ్మేళనం మరియు ఇద్దరు ప్రముఖులకు పురస్కారాలు ప్రధానం జరిగింది. భావ కవి శ్రీ కొరిశెపాటి బాలక్రిష్ణారెడ్డి గారిని మరియు తెలుగుభాష పరిశోధకురాలు శ్రీమతి ఢాత్రి కుమారి గారిని కళామిత్ర ప్రతిభా పురస్కారాలతో సన్మానించారు. ఈ సభకు శ్రీ నూనె అంకమ్మరావు గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమములో భాషా విభూషణ డాక్టర్ నాగభైరవ ఆదినారాయణ గారు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ భూసరపల్లి వెంకటేశ్వర్లు గారు, నరసం గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి తేళ్ళ అరుణ గారు,  శ్రీ కుర్రా ప్రసాద్ గారు, శ్రీ మిడసల మల్లిఖార్జునరావు గారు పాల్గొన్నారు. కవిసమ్మేళనమును శ్రీ ఉప్పలపాటి వెంకటరత్నం గారు నిర్వహించారు. కవిసమ్మేళనములో పాల్గొని శ్రీ రాజేంద్రప్రసాద్ గారు కవితలకు స్వాగతం అనే కవితను వినిపించారు. కవిత బాగున్నదని శ్రోతలు కరతాళధ్వనులతో హర్షం వ్యక్తపరిచారు. తర్వాత శ్రీ రాజేంద్రప్రసాద్ గారితోపాటు పాల్గొన్న కవులందరికి సన్మానం చేశారు.
కామెంట్‌లు