భక్తనందదాస్! అచ్యుతుని రాజ్యశ్రీ
 మధురా నగరంలోకి దగ్గరలో రాంపూర్ అనే చిన్న పల్లెలో జీవరాం అనే బ్రాహ్మణ భక్తుని కొడుకు గా 1570లో నందదాస్ పుట్టాడు.బాల్యంనుంచీ దైవ స్మరణ భక్తీ . ఎక్కడ సత్సంగము జరుగుతుంటే అక్కడికి పరుగెత్తేవాడు ఆచిన్నారి.ఎంతోమంది సాధు సన్యాసులతో పరిచయం ఏర్పడింది.గురువు విఠలనాధుడు వద్ద శిష్యరికం చేశాడు.అమ్మనాన్న బాల్యంలోనే చనిపోటంతో తాత దగ్గర పెరిగాడు.నరహరిపండిట్ వద్ద ఆపిల్లాడు సంస్కృతం నేర్చుకున్నాడు.మహాభాగవతం కృష్ణుడంటే అమిత ప్రేమ ఆరాధన .కాశీకి వెళ్ళి భక్త తులసీదాస్ ను కలిశాడు.అలా  ఉంటూనే కొందరు భక్తులతో కల్సి తీర్థయాత్రలు చేయాలని తులసీదాసు అనుమతి తీసుకుని బైలుదేరాడు.ఏకాస్త అందంగా ఎవరు కనిపించినా కృష్ణ పరమాత్మ అందాన్ని చూసేవాడు.అలా కొందరు స్త్రీలను చూడటం గమనించిన వారు అతన్ని నిందించి మందలించారు.వ్రజభూమిలో భక్తి సూరదాసు పరిచయంతో కృష్ణ భక్తి లో మునిగి పోయాడు.గోస్వామి విఠలనాధుడు వ్రజభూమిలో ఉన్న గాయకులు భక్తులను ఓచోట చేర్చి కృష్ణ తత్వంపై కవితలల్లమని ప్రోత్సహించాడు.వారినే అష్టఛాప్ అని అంటారు.అందరికన్నా వయసులో పెద్ద వాడుసూరదాస్ ఐతే అందరికన్నా చిన్న వాడు నందదాస్.రాధాకృష్ణప్రేమతత్వం గూర్చి వ్రజభాషలో అమూల్య సాహిత్యం వెలువడింది.నందదాస్ రాసక్రీడలుగూర్చి అద్భుతంగా కీర్తనలు వ్రాశాడు. యమునా తీరం మధురాపురం బృందావనం...ఇలా ప్రతిదీ ఆయన పాటలో పల్లవించాయి.నందదాస్ భాగవతంని వ్రజభాషలో రాస్తే కొందరు అసూయాపరులకు‌అది గిట్టలేదు.తాము వ్రజభాషలో చెప్పే ప్రవచనాలు ఎవరూ వినరని గగ్గోలు పెట్టారు.అప్పుడు నందదాస్" అయ్యా! మీ పొట్ట కొట్టాలని నేను వ్రజభాషలో రాయలేదు.ఇదిగో నాగ్రంథాన్ని యమునా నదిలో విసిరేస్తున్నాను" అని నీటిలో పడేశాడు.కేవలం దశమస్కంధాన్ని మాత్రం ఉంచుకున్నాడు.60వ ఏట నందదాస్ కృష్ణ పరమాత్మ లో ఐక్యమైనాడు.కానీ ఆయన గీతాలు లోకప్రసిద్ధాలు.ఆరోజుల్లో కవులు ఈర్ష్య అసూయ ద్వేషాలతో మగ్గేవారని తెలిసిపోతోంది కదూ?🌹
కామెంట్‌లు