ప్రేమ!!!- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
రాత్రంతా నిద్రపుచ్చి
పొద్దున్నే ఉదయించిన భానుడు
ఒక అనిర్వచనీయ ప్రేమ!!!

చీకటిని తరిమేసి
నిండు పున్నమి వెన్నెలై
నెలవంకగా మారిన చంద్రుడు
ప్రేమకు ఒక నిర్వచనం!!!

గొంతెండిపోయిన
భూదేవిని ఆదుకున్న
ఆ నది ఒక నిర్వచనీయమైన ప్రేమ!!

ఆకలి గొన్న పశుపక్షికి
తన శరీరాన్ని పచ్చని మేతగా పండుగ
ఇచ్చిన ఆ చెట్టు
ప్రేమకు ఒక నిర్వచనం!!!

శిలను చెక్కి శిల్పం చేసిన
శిల్పి లా
ఈ ప్రపంచాన్ని కన్నా
స్త్రీ మూర్తి
అనిర్వచనీయ ప్రేమకు
ఒక ఆకారం ఒక రూపం!!!

సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పిఎస్ నంది వడ్డేమాన్ నాగర్ కర్నూల్ జిల్లా.
కామెంట్‌లు