హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర
 73.
ఉత్పలమాల.
భృత్యువునై దరిన్ నిలిచి వెట్టిగ జేయుదు సేవలెన్నియో
నిత్యము నీదు దాసులకు నే పరిచర్యలు సల్పుదాన నిన్
బత్యము కోరనో వరద!భాగ్యము నాదని పొంగుచుందు నే
సత్యము చెప్పుచుంటినయ!సన్నిధిలో పడియుందునో హరీ!//
74.
ఉత్పలమాల.
గరుడుని హెచ్చరించి 'పద!గ్రక్కున పోవలె "నంచు వచ్చి యీ
తిరుగిరి  కొమ్ముపై గొలువు దీరితి వీభువి నేలగన్ సదా
చిరుచిరు హాసముల్ చిలికి చింతలు తీర్తువు భక్తకోటికిన్ 
సిరివర!నిన్ను గాంచ నఘశేషము తొల్గుట తధ్యమౌ హరీ!//
.
కామెంట్‌లు