సౌందర్యలహరి ;- కొప్పరపు తాయారు
🌟శ్రీ శంకరాచార్య విరచిత 🌟

గిరామాహుర్దేవీం ద్రుహిణగృహిణీమాగమవిదో
హరేః పత్నీం పద్మాం హరసహచరీమద్రితనయామ్ ।
తురీయా కాపి త్వం దురధిగమనిఃసీమమహిమా
మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మమహిషి ॥ 97 ॥

కదా కాలే మాతః కథయ కలితాలక్తకరసం
పిబేయం విద్యార్థీ తవ చరణనిర్ణేజనజలమ్ ।
ప్రకృత్యా మూకానామపి చ కవితాకారణతయా
కదా ధత్తే వాణీముఖకమలతాంబూలరసతామ్ ॥ 98

97) అమ్మా ! వేదాంత వైద్యులు నిను సరస్వతిగాను, హరిప్రియైనా శ్రీ మహాలక్ష్మి గాను, శివపత్నీయగు పార్వతి దేవి గాను, వర్ణిస్తున్నారు. నువ్వు ఆ ముగ్గురిని అధిగమించిన దానివై పొందరాని, అంతులేని, అపారమహిమా సమాన్విత వై మహా మాయ ప్రకృతి నివ్వగా పరిబ్రహ్మపట్టపురాణిగా విశ్వాన్ని పరిభ్రమింప చేస్తున్నావు కదా! తల్లీ!
98)
     అమ్మా !పరబ్రహ్మమును తెలియకోరి నేను పారాణీలా ఎర్రని నీ  చరణాలు ప్రక్షాళనం చేసిన తీర్థాన్ని విద్యార్థినై ఎప్పుడు తాగుతానో కదా! తల్లీ! జన్మతః మూగవాడైనా వానికి కూడా కవిత శక్తి రాగలగడానికి హేతు భూతమైనా వాణీ యొక్క ముఖారవిందములోని తాంబూల రసాన్ని నేను గ్రహించగలిగేది ఎన్నడో కదా! తల్లీ !                  
      ****🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు