మంచి నడవడిక;- సి.హెచ్.ప్రతాప్
 మనం చేసే  పాప పుణ్యాలే
మన జీవితాలను నడిపిస్తాయి
చింతనలు, ఆందోళనలు లేని
సుఖమయ జీవితానికి ధర్మ బద్ధంతో
పాప రహితమైన జీవితం సాగించడమెంతో అవసరం
పతనం అంచులో పడి తప్పు చేసిన వారిని శిక్షించడం ,
వారు తిరిగి తప్పులు చేయకుండా
సంస్కరించడమే దయామయుడైన భగవంతుని కర్తవ్యం
పాపకార్యాలను చేసిన వారికి శిక్ష
అనుభవించడం తప్పని సరి.
చేసిన తప్పొప్పులను విశ్లేషించుకొని
శుభ సంస్కారాలతో  చెడును రూపు మాపుకొని
పరివర్తన సంస్కృతిని కొనసాగిస్తూ
విలువలకు కట్టుబడి వుంటూ
ఆజ్ఞానం నుండి విడిపడి ఆత్మను
మలిన రహితం చేసుకొని
హృదయ పరివర్తన పొందిన వారి జీవితం ధన్యం
 వారే భగవంతునికి ఇష్టులు
పరివర్తన సంస్కృతిని కొనసాగించాలి
విలువలకు కట్టుబడి ఉండాలి 
కామెంట్‌లు