సుప్రభాత కవిత ; బృంద
కిరణాల దోబూచులాటలో
రోజాల  గుత్తులూగు తోటలో
రోజు మొదలౌ ఒక పాటలా

మయూఖపు కాంతుల చెంగట
మనోహరమైన ముంగిట
మయూరమైపోదా మనసు?

ప్రతిపొదా పరవశించి
ప్రేమతో పలకరించి
పంచు పరిమళాలు

లేత ఎండ చురుకులూ
పూత నిండిన తోట ఛమకులూ
చిందులేయు చిత్తాన భావాలు

అడుగులు పడుతుంటే
హత్తుకుని ఆనందించే
పచ్చని పచ్చిక తివాచీలు

అప్రయత్నంగా మనసున
తోచిన మాటిదే..
ఎంత చక్కనిదీ జగతి
ఆ దైవమొసగిన బహుమతీ!

అక్షరాలకు అందని 
ఆనందం నిండిన
అపురూప క్షణాల
తాయిలం తెచ్చే తొలికిరణాలకు

🌸🌸సుప్రభాతం 🌸🌸
కామెంట్‌లు