నీదేశ భవిత మార్చుకో;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 మేలుకో యువతా నీ నిద్ర మేలుకో
మేలుకో యువతా నీదేశ భవిత మార్చుకో
జనశిక్షణ జనరక్షణ జనజాగృతి చేయనెంచి
పసిబాలల అభ్యున్నతి బడుగువర్గ అభివృద్ధి
స్వామీ వివేకానంద కలలుగన్న
నవభారతజాతి నిర్మాణమే
నీ పరమకర్తవ్యంగాభావించు
జనజీవన ప్రమాణాలు
పెంచి పంచి హితము చేయ
సమత మమత పెంచుటకు
నడుంకట్టు దేశహితము అతిశయించ
తాడిత పీడిత జనులకు ఊతగర్రగా నిలిచి
దైన్య హైన్య జనావళికి భా సమాన హాసమీయ
దివ్యభారతాంబ ఋణం కొంతతీర్చి యశంపెంచి
మనరక్తపు చివరిబొట్టు సిందూరం గావించగ
మేలుకో యువతా నిద్రమేలుకో
మేలుకొని నీదేశ భవిత మార్చుకో!!
**************************************
కామెంట్‌లు