సుప్రభాత కవిత ; -బృంద
నీవు వచ్చే దారి మొత్తం
పూలు వేలుగా విరియ చేసి
ఎదురు చూసీ 
ఎదను పరచి

కళ్ళు రెండూ  నీకు వచ్చే
దారిని దీపముగ చేసి
మది నిండుగ 
మమతలన్నీ
మల్లెమాలలై ఊయలూగ

తెరలుతెరలుగ పొరలుతున్న
ప్రేమనంతా పోగుచేసి
కంటి వెంట చూపుగ జార్చి
దోసిట నిండుగ మల్లెలు చేసి

నీ పాదాలకు అంజలి ఘటింప
మంగళ వాద్యమై మోగ
నా గుండె చప్పుడే....
ఎప్పుడెప్పుడు నీ రాక అని

నిరీక్షించు  నా మనసుకు
తొలి కిరణం తాకగనే
నిలువెల్ల కరుగు నీహారికనై
నీ పాదముల పువ్వులతో

అభిషేకించి కనుల నీరు 
ధారగా కురవగా ...
ధరణికి దిగి వచ్చి...
న న్ను బ్రోచు దైవమై

కనుల ముందు నిలువ
జగతికి సుగతిని ఇచ్చి
జనులను సుజనులుగా
జీవింప వరమిమ్మని

మనవి చేయు మనమున
విరియు వెల్గుల వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు