శివఅపరాధ క్షమాపణ స్తోత్రం; కొప్పరపు తాయారు
 🍀 శ్రీ శంకరాచార్య స్తోత్రం 🍀
11)
హృద్యం  వేదాన్త వేద్యం హృదయసరసిజే  దీప్తముద్యత్ప్రకాశం 
సత్యం శాన్త స్వరూపం సకల మునిమనః పద్మషణ్డైక వేద్యమ్ !
జాగ్రత్యప్నేసుషుప్తౌ త్రిగుణ విరహితం శంకరం న
 స్మరామి 
క్షన్తవ్యో మేపరాధః ! శివ శివ శివ శంభోః !
  శ్రీ మహాదేవా! శంభో !
11)
       ఓ శివా! మనోహరుడవు, వేదాంతముచే తెలియబడు వాడవు, హృదయ పద్మమునందు వెలుగొందుచున్నవాడు, ప్రకాశవంతుడు, సత్యము శాంతము స్వరూపము కలవాడు. సకల మునుల హృదయ పద్మములందున్న వాడవు, సత్వ రజోగుణములు లేని వాడవు అగు నిన్ను మెలుకువ యందు కానీ గాఢ నిద్ర యందు కానీ  ఎన్నడూ స్మరించలేదు. శ్రీ మహాదేవా ! శంభో !శివా ! నా అపరాధము ను క్షమించుము.
                     ***🪷***
🪷 తాయారు 🪷
కామెంట్‌లు