స్ఫూర్తి!!!;- సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా సునీత ప్రతాప్ ఉపాధ్యాయిని కవిత
 =============================================================       ‌‌     
చిట్టి చీమకు
ఆహారం దొరికితే
చీమలన్నింటినీ
వెంటబెట్టుకొస్తుంది.
అన్నీ కలిసి పంచుకు తింటాయి.!!

అమ్మ ఒక్కతే
అలా చేస్తుంది.
అమ్మ నాన్నకు స్ఫూర్తి.!!

కాకికి
ఆహారం దొరికితే
కాకులన్నింటిని
వెంటబెట్టుకొస్తుంది.
అన్నీ కలిసి పంచుకు తింటాయి.!!

అమ్మ ఒక్కతే
అలా చేస్తుంది
అమ్మా నాన్నకు స్ఫూర్తి!!

కోతులకు
ఆహారం దొరికితే
కోతులన్నింటినీ
వెంటబెట్టుకొస్తాయి.
అన్నీ కలిసి పంచుకు తింటాయి.!!

అమ్మ ఒక్కతే
అలా చేస్తుంది
అమ్మ నాన్నకు స్ఫూర్తి!!

ఈ కవిత కవయిత్రి రావూరి వనజ గారికి అంకితం.

కామెంట్‌లు