సహజాతం(సఖ్యత);- :డా.రామక కృష్ణమూర్తి బోయినపల్లి,సికింద్రాబాద్.
ఒకరి మనసొకరెరిగిన చాలును,
బంధమో,బాధ్యతో కట్టినను,
అవకాశమో,అవసరమో
ఎరిగినను,
ప్రయోజనమో,పరిష్కారమో కనుగొనినను,
నష్టనివారణ కోసమో,
భవిష్యత్తు నాటకమో ఆడినను,
పెంచుటకో,పంచుటకో,
తెంచుటకో,ముంచుటకో తెగబడినను,
సమయస్ఫూర్తి నిమిత్తం,
సానుకూల దృక్పథం,
తెలిపినను,
పాండిత్యమో,పామరమో వెల్లడి చేసినను,
అభిరుచి,అలవాట్లకో 
ముడివడినను,
సుఖమో,దుఃఖమో,
అదృష్టమో,దురదృష్టమో
పరీక్షించినను,
విజయం,అపజయం దోబూచులాడినను,
ప్రకృతియైన,వికృతియైన
రూపుదాల్చినను,
సఖ్యత అస్త్రమై,లౌక్యమై,
వివేకమై నిలిచి,మలుచును.
కామెంట్‌లు