సమయం లేదు!!?;- డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా
భూమిపై నుంచి పైకి చూస్తే
ఒక్క సూర్యోదయమే కనిపిస్తుంది
ఎన్నిసార్లు పైకి చూసినా
ఒక్క సూర్యోదయమే కనిపిస్తుంది.

ఈ లోకంలో చాలా పని ఉంది
కానీ సమయం లేదు.!!!?

ఎన్నిసార్లు ఈ మైదానంలో
విత్తులు చల్లిన
మహారణ్యాలే మొలుస్తున్నాయి
పాడిపంటలు తోటలే కనిపిస్తున్నాయి.

రుతువులు మారుతున్నవి
కానీ సమయం లేదు.!!!?

ఎంత పారిన ఎంత ప్రవహించిన
నదులు జన్మిస్తూనే ఉన్నాయి
జీవిస్తూనే ఉన్నాయి.

అంతులేని ఆ జన్మ స్థలానికి
సమయం లేదు!!!?

భూమిపై
మొక్కలు జంతువులు నదులు
మాయమవుతున్నాయి.
ఇక్కడ మనిషి ఒక్కడే జీవిస్తున్నాడు.

సమయం లేదు.!!!?

వెలుగును మాత్రమే చూడు చీకటిని కాదు.!!?

డాక్టర్ ప్రతాప్ కౌటిళ్యా 🙏
కామెంట్‌లు