తొలిపొద్దు వెన్నెల;- మహమ్మద్ చాంద్ బేగం - మధిర - ఖమ్మం జిల్లా
ప్రక్రియ:సున్నితం 
===============
పక్షుల కిలకిల రవళులు
ఉషా కిరణాలతో మనమందరం
పలకాలి తొలిపొద్దుకి స్వాగతం 
చూడచక్కని తెలుగు సున్నితంబు

తొలిపొద్దు వాకిళ్ల ముంగిట
రంగురంగుల ముగ్గులు వేసి
తెలుగు సొగసులు విరజిమ్ముచు
చూడచక్కని తెలుగు సున్నితంబు 

తొలి పొద్దున్నే లేచి
నడక వ్యాయామం  చేసి
స్నానమాచరించి పూజ చేసి 
చూడ చక్కని తెలుగు సున్నితంబు

తొలిపొద్దున ఆకాశవాంక చూసి
అరక పట్టుకుని అన్నదాత
పొలంలో శ్రమిస్తాడు రైతన్న
చూడ చక్కని తెలుగు సున్నితంబు

పొద్దున్నే లేవడం వలన 
సమయానికి  పనులు చేసుకుని
చురుకుగా ఆరోగ్యంగా ఉంటాం
చూడ చక్కని తెలుగు సున్నితంబు

          
కామెంట్‌లు