శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
341)జనేశ్వరః -

జనములకు ప్రభువైనవాడు
ప్రజాపరిపాలనము చేయువాడు
ఈశ్వరతత్వము గలవాడు
ప్రాణులనడుపుచున్న వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
342)అనుకూలః -

సర్వానుకూలమైనట్టి వాడు
భక్తులననుగ్రహించుచున్నవాడు
సర్వులగమనించుకొనువాడు
అనుకూలముగా నున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
343)శతావర్తః -

ధర్మరక్షణ చేయునట్టివాడు
అనేకసార్లు జనించినవాడు
సంరక్షణ సంకల్పమున్నవాడు
శతావర్తనుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
344)పద్మీ -

పద్మమును చేతబట్టినవాడు
తామరహస్తుడైనట్టి వాడు
పద్మమును ధరించినవాడు
పద్మాకరనామమున్నట్టివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
345)పద్మనిభేక్షణః -

పద్మములవంటి కన్నులున్నవాడు
తామరనేత్రాలున్నట్టి వాడు
పద్మసమాననయనుడు
పద్మనిభేక్షణుడైనట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )
కామెంట్‌లు