సుప్రభాత కవిత ; -బృంద
రెక్కలపై నమ్మకముంది
భయం లేదు ఎత్తంటే!

తారాపధం తాకాలని లేదు
ఆశ లేదు చుక్కలంటే!

ఒకచోటే ఉండాలని లేదు
లెక్కలేదు దూరమంటే!

ఒంటరి తనమన్న మాటలేదు
ఎపుడూ సమూహం తనవెంటే!

సొంతమంటూ ఏమీలేదు
లోకమంతా తన ఊరే!

ఆశయమంటూ ఏదీలేదు
ఆనందమే  పరమావధి

స్వార్థపు సోది లేదు
కడుపు నిండితే చాలు

హాయైన బ్రతుకులు
విహంగాల జీవనచిత్రాలు

అవినీతులు అక్రమాలు
అవమానపు అసంతృప్తులు

అన్నీ కావాలన్న అత్యాశలు
అందరికీ అందకూడదన్న దురాశలు

అలవికాని అరాచకాలు
అంతం లేని దారుణాలు

విచక్షణ లేని విజ్ఞానం
క్రమశిక్షణలేని జీవనం

అవలక్షణాలన్నీ ఆనందంగా 
సొంతం చేసుకున్నది మనిషే!

అత్యుత్తమ జన్మంటూ పేరు
అధమాధమ విలువలే నేటితీరు

అందమైన జగతిలోని
సుగుణమేదీ నేర్చుకోని

తీరు మారే దారి చూపి
విలువలు నేర్పే వేకువకు

🌸🌸 సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు