నవ్వడం ఒక యోగం-సి.హెచ్.ప్రతాప్
 నవ్వడం ఒక భోగం... నవ్వించడం ఒక యోగం... నవ్వకపోవడం ఒక రోగం' అన్నాడో మహాకవి. ఒకప్పుడు నవ్వు నాలుగు విధాలా చేటు అనేవాళ్లు, కానీ ఇప్పుడు నవ్వు నలభై విధాలా గ్రేటు అంటున్నారు. సృష్టిలో ఉన్న జీవులన్నింటిలోనూ హాయిగా నవ్వగలిగే వరం ఒక్క మనిషికే మాత్రం సొంతం.మనస్పూర్తిగా, హాయిగా నవ్వడం వలన ఎన్నో శారీరక, మానసిక సమస్యలు దూరం అవుతాయని వైద్యులు ఘంటాపధంగా చెబుతున్నారు.  కానీ నేటి యాంత్రిక జీవనంలో మనిషి నవ్వును మరిచిపోతున్నాడు.ఇది ఒక దురదృష్టకర పరిణామం.హాస్యం నవరసాల్లో ఒకటి. కానీ అది మన జీవితాల్లో తగ్గిపోతోంది. కోపం, ఆవేశం, .అసంతృప్తి ఎప్పుడూ మన వెంటే ఉంటాయి. దశాబ్దాలు గడిచినా వీటి నుంచి మనిషి బయటపడలేకపోతున్నాడు. మితిమీరిన ఒత్తిడి, పోటీతత్వం, ఇలా అనేక సమస్యలు దీనికి ప్రధాన కారణం. ఇవి మనిషిని నవ్వుకు దూరం చేయడమే కాదు అసలు నవ్వడమే మర్చిపోయేలా చేస్తున్నాయి.

నవ్వుపై కొన్ని ప్రఖ్యాత కోట్స్ ఈ కింది విధంగా వున్నాయి:
మన పెదవులపై మల్లెపువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే…. మనల్ని అందరూ ఇష్టపడతారు.ఎప్పుడు బాధపడుతుంటే బ్రతుకు భయపెడుతుంది.అదే ప్రతి క్షణం నవ్వుతూ ఉంటె జీవితం తలవంచుతుంది.అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చెరిపేస్తుంది…భయంకరమైన మౌనాన్ని ఒక మాట తుడిచేస్తుంది.చిరునవ్వు అనేది ఎటువంటి క్లిష్టమైన సమస్యనైనా  తెరువగల తాళం చెవి దానిని ఎప్పుడూ మీ దగ్గరే ఉంచుకోండి. ఎప్పుడు నవ్వుతు ఉండు అప్పుడు ఈ ప్రపంచంలో ఎవరు నీకన్నా అందంగా ఉండరు . ఏ సమస్యకైనా చిరునవ్వు ఉత్తమ సమాధానం.ఒక చిన్న చిరునవ్వు మీ జీవిత కాలాన్ని 30 సెకన్లు పెంచుతుంది.మీ అందమైన చిరునవ్వుతో ప్రపంచంతో పోరాడటానికి. 
కామెంట్‌లు