మరుగున పడిన మాణిక్యం! అచ్యుతుని రాజ్యశ్రీ
 " న రత్నం  అన్విష్యతి.  మృగ్యతే. హి. తత్"  మహాకవి కాళిదాసు మాట ఇది. దాని అర్థం రత్నం వెతకదు.వెదకబడ్తుంది.ఆసూక్తికి  నిదర్శనం 18.4.1972లో  తన 92 ఏళ్ల పండువయసులో పరమాత్మని చేరిన భారత రత్న పి.వి.కాణే! బొంబాయి విశ్వవిద్యాలయం కి ఉపకులపతిగా రెండు ఏళ్ళు పనిచేసి  పుస్తకం పఠనం  రచనల కోసం  వృత్తి ఆటంకం అని రిజైన్ చేశారు.30ఏళ్లు ఎన్నో గ్రంథాలు చదివి రోజూ18  గంటల చొప్పున 20వేల పేజీల ధర్మశాస్త్ర చరిత్రను ఆంగ్లం లో రాసిన అపూర్వ మేథావి సాహితీ వేత్త.ఆరోజుల్లో ఒక టైపిస్ట్ స్టెనో సాయం తీసుకోకుండా అంతా తానై స్వయంగా  రచయితలకు ఆదర్శం గా నిలిచిన ఏకైక అపూర్వ మేథావి భారతరత్న పి.వి.కాణే మహారాష్ట్ర లోని  రత్నగిరి జిల్లాలో పుట్టారు.
అసలు ఆయన ధర్మశాస్త్ర చరిత్రను పరిశోధన చేయాలని నిశ్చయించుకోడానికి వెనుక ఓవేదన ఆవేదన ఉంది.
ఆరోజుల్లో వితంతువు  జీవితం దుర్భరం.ముఖ్యంగా బ్రాహ్మణ బాలవితంతువు జీవితం నరకప్రాయం. శిరోముండనం నెత్తిన తెల్ల ముసుగులో ఆమె పుట్టింట అత్తింట గొడ్డు చాకిరీ తో బానిసత్వం తో మగ్గిన రోజులు.జుట్టున్న వితంతువు పండరీపురం లో  పాండురంగని విగ్రహాన్ని తాకి పాదాలమ్రోల తలవాల్చబోతుంటే పురోహితులు అడ్డుకున్నారు.ఆవిషయం తెల్సిన న్యాయవాది  వెంటనే
థర్మశాస్త్రాలు తిరగేసి వితంతువుల విధివ్రాతను మార్చారు.ఆంతటి గొప్ప సంస్కర్త తనకొడుకు పెళ్లిని ఓవితంతువుతో జరిపించిన ఆదర్శమూర్తి.ఆయనపూర్తి పేరు పాండురంగ వామన్ కాణే!40 ఏట హరిజనులకు దేవాలయప్రవేశం కల్పించారు. ఇక రచయిత గా ఆయన కలం సాగిపోయిన నది.5వేల థర్మశాస్త్రగ్రంథాల సమీక్ష జర్మనీ ఫ్రెంచ్ ఆంగ్ల పుస్తకాలు పరిశీలించి వ్రాసిన ఆయన ఓపిక సామర్థ్యం నభూతో నభవిష్యతి.అధ్యాపకునిగా సంస్కృతాచార్యునిగా న్యాయ వాది గా రాణించిన ప్రతిభాశాలి.1953 లో రాజ్యసభ సభ్యుడు గా రాణించారు. జాతీయ కాంగ్రెస్ సభలకు బ్రాహ్మణ సభలకు ఏషియాటిక్ సొసైటీ భండార్కర్ పరిశోధనాలయంకి సలహాదారు గా ఉన్నారు.ఆయన తన పుస్తకంలో ఇలా వ్రాశారు " నేను చేసింది స్వల్పం.చేయాల్సింది అనంతం‌" ఆంగ్ల కవి బ్రౌనింగ్ కవితలో పంక్తులు తన గ్రంథం చివరి లో ఉటంకించారు.
Look at the end of the work
The petty done  the undone vast🌷
కామెంట్‌లు