జయహో మహిళా....! జయ జయ హో...! - కోరాడ నరసింహా రావు!
కన్న తల్లి యై
మాతృత్వ మాధుర్యాన్ని.... 
 
తో బుట్టువై.. 
ఆప్యాయతాభిమానా లను... 

అర్ధా0గియై.. ప్రేమానురాగాలను..., 

కన్న బిడ్డ యై... 
 నట్టింట నడ యాడి... 
 శ్రీ మహా లక్చెగా .. 
 సిరులను పంచుతూ...., 

సమాజిక జీవనాన్ని ... 
 పరి పుష్టం చేసి... 
 జీవన మాధుర్యాన్ని.. 
 అందించే శ్రీ మూర్తి...., 

తర- తరాలుగా....చెయ్యని తప్పుకు...
 ఎంత సిక్ష ననుభవించిం దని! 
 ఎంతగా అణచి వేయ బడిం దని..! 
  అన్ని0టా ఎంతగా.. 
 వివక్షకు లోనైనదని...! 

ఎన్ని ప్రాధేయతలు... 
ఎన్నెన్ని  అభ్యర్ధనలు... 
 ఉద్యమాలు... పురాటాలు
 శ్ర మ  ఫలించి0ది...! 

విద్యా, వివేకాల స్వేచ్ఛావాయువులు పీల్చుకుని
 అన్ని రంగాలలో తన సత్తానుచెటుకు0దికదా... 
 నేటి మహిళ...! భలా...!! 
 మహిళా శక్తి వర్ధిల్లాలి...! 
 ఆనంద సమాజం వీలసిల్లాలి!! 
 జయహో... మహిళా... 
  జయ- జయహో....!!
కామెంట్‌లు