జీవనయానం- సి.హెచ్.ప్రతాప్
 అమూల్యమైన ఈ జీవితంలో
సాధించాల్సింది అనంతం
సాధించింది అత్యల్పం
ఎన్నో సవాళ్ళు, ఎన్నో అడ్డంకులు
ఎన్నో సమస్యలు, అవరోధాలు
సమర్ధవంతంగా దాటుకుంటూ ముందుకు సాగాలి
అనుపలభ్యమైన లక్ష్యాలను చేధించాలి
ఎన్నో మనోవేదనలను దూరం చేసుకోవాలి
ఎన్నో బాధ్యతలు, కర్తవ్యాలను నిర్వర్తించాలి
జీవనయానం అంతా ముళ్ళబాట కావచ్చు
అయినా దాటుకుంటూ వెళ్ళాలి
కొండంత మనోధైర్యం,మనోనిబ్బరం
ఆత్మవిశ్వాసం, శక్తిసామర్ధ్యాలు పోగు చేసుకోవాలి
ఎన్నో చిక్కుముడులు విప్పాలి
మనస్సులో జ్ఞాన జ్యోతులను వెలిగించుకోవాలి
బలహీనమౌతున్న బాంధవ్యాలకు
గట్టి ముడులు వేయాలి
విడిపోయిన బంధాలను తొలగించుకోవాలి
మన జ్ఞానాన్ని ఎందరికో పంచాలి
మానవత్వాన్ని పరిమళింపజేయాలి
కాబట్టి అలసత్వం వదిలించుకో
లక్ష్య చేధనలో ముందుగు సాగు
సమయాన్ని వృధా చేసుకోకు
కనురెప్ప ఎప్పుడు శాశ్వతంగా
మూతబడుతుందో ఎవరికి తెలుసు?
కామెంట్‌లు