స్నేహమే!- - డా.గౌరవరాజు సతీష్ కుమార్
 మనసులో పుట్టి
మట్టిలో కలిసేంతవరకు
తోడుగా ఉండేది
తాను కష్టాలకడలిలో మునుగుతున్నా
తనవారిని సుఖాలతీరం చేర్చేది
ఒకరికోసం ఒకరుగా
కలకాలం కలిపి ఉంచేది
మన జీవితమంతా
సంతోషంగా ఉంచేది
నిజమైన స్నేహమే!!
**************************************
కామెంట్‌లు