అన్న ప్రేమ అమరం;- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
అమ్మానాన్న తానై
తమ్మునికి అన్నియై
ఒడిలోన నిదరపుచ్చే!
తనకు కూడా నిద్ర వచ్చే!

అన్న ప్రేమ బహు గొప్పది
అవనిలోనే మిన్నది
తండ్రి వంటి వాడు అన్న
తరచి చూడ  మనసు మిన్న

ఇంటి మెట్లు ఇల్లాయే!
అట్ట ముక్క పరుపాయే!
వీధులే దిక్కాయే!
చూడ! గుండె చెరువాయే!

పేద వారి దుస్థితి
నిరాశ్రయుల పరిస్థితి
ఇంతేనా! లోకంలో
ఇకనైనా! మారదా!!
బడుగుజీవుల తలరాత!!

కామెంట్‌లు