పూజిద్దాం - దర్శిద్దాం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 భరతమాత చరణమే మనకు శరణము
వేదంలోపుట్టినా వేదనలో పెరిగింది
ఆక్రమణలోనలిగినా చిరంతనగ వెలిగింది
మునుల,ఋషుల నిర్మల తపోభూమి ఇది
సాక్షాత్తూ దేవుడే స్వయంభువైన పవిత్రభూమి ఇది
యోగులూ,ప్రవక్తలూ తిరుగాడిన దివ్యభూమి ఇది
వేదసారమైన భగవద్గీత వెలసిన కర్మభూమి ఇది
జీవనదులతో,సతత సస్యశ్యామల దేశమిది
భారతీయుల ప్రాణప్రదము,మానధనము ఇది
సర్వమతాల సమరసభావన రూపమిది
సర్వజనుల సముపార్జన సమన్వయమిది
మన ధర్మపుటౌన్నత్యాలను దశదిశలా
మారుమ్రోగేలా చాటి చెబుతున్న
మనందరి కన్నతల్లి భరతమాత ఇది
కవిగాయక గణాలంత అవిశ్రాంత కీర్తనలతో
జ్ఞానవిజ్ఞాన సమూహమంత దివ్యభారత నిర్మాణంతో
భారతీయ జనగణమంత భరతమాత చరణాలమ్రోల
సహృదయమున సతతము భారతమాతను పూజిద్దాం
వసివాడని వన్నెచెడని భవ్యభారతిని దర్శిద్దాం!!
*************************************
కామెంట్‌లు