ఎం.ఆర్.జయకర్! అచ్యుతుని రాజ్యశ్రీ
 ఈయన గూర్చి అంతగా సమాచారం దొరకదు.కొంతమంది జీవిత చరిత్రలు పదేపదే వేసి ప్రచారం చేశారు కానీ ఇలాంటి ప్రతిభావంతులైన వారి విశేషాలు పుస్తకాల లో అక్కడక్కడ చమక్ అంటాయి.
అలాంటి వారిలోజయకర్ ఒకరు.పూర్తిపేరు ముకుంద రామారావు జయకర్ 1873 నవంబర్ లో జన్మించి1959 లో మార్చి 10 న అస్తమించారు.తాత తల్లి తండ్రిగారు న్యాయవాది.బాల్యంలోనే తండ్రి చనిపోటంతో తల్లితో కల్సి అమ్మమ్మ గారింట్లో పెరిగారు ఆయన.మరాఠా ఉడుకురక్తం . సంస్కృతం లో ఎం.ఎ.చేసి స్మృతి గ్రంథాలు కాచివడబోశారు. 1905 లో ఇంగ్లాండ్ లో బారిష్టర్ ఐనారు.ఇంకో విశేషం ఏమంటే ఆయనకు చదువుకోవటానికి అవకాశం నిరాకరించిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆతర్వాత డి.సి.ఎల్.తో సత్కరించింది. మనదేశం లో ఓగొప్పన్యాయవాదిగా ఉంటూ బొంబాయి క్రానికల్ పత్రికకి డైరెక్టర్ గా ఉన్నారు.స్వాతంత్ర్యపోరాటంలో ఈయన పాత్ర అమోఘం.ఖాదీ ఉద్యమం కి 25వేల రూపాయలు విరాళం ఇచ్చారు.మాలవ్యా లజపత్ రాయ్ ప్రశంసలు పొందారు.రౌండ్ టేబుల్ సమావేశాలకి హాజరైనారు.1937 లో ఫెడరల్ కోర్టు జడ్జిగా పనిచేశారు.పూనా యూనివర్సిటీ ఉపకులపతి గా9ఏళ్ళు ఉన్నారు.ప్రాంతీయ మాతృభాష లో విద్యాబోధనను సమర్ధించారు.అతివాదులకు ఈయన నచ్చలేదు.నైతిక ఆధ్యాత్మికచింతనకు పట్టంగట్టిన జయకర్ చరిత్ర మరుగున పడిన మాణిక్యం 🌷
కామెంట్‌లు