సుప్రభాత కవిత ; - బృంద
రేయి గడవగానే పగలు
చీకటి తరిమేస్తూ వెలుగు
మాపును మురిపించే రేపు
కలతను మరిపించే కలలరూపు

అదిరే  భయాలు పోగొడుతూ
బెదిరే మనసుకు తోడౌతూ
చెదిరిన కలలతో బెంగపడ్డ
మదిని కుదురుగ ఉండేలా...

నీతికి విలువుండేలా
నిజాయితీలు కలిసి వచ్చేలా
మోసాలు ద్వేషాలు లేని
నిర్మల హృదయాలు పెరిగేలా

మంచికి  మంచి రోజులు వచ్చి
చెడ్డకు చేటుకాలం దాపురించి
తేటగ బ్రతుకులు నడిచేలా
మాటకు బలం ఉండేలా

మనుగడకు స్వతంత్రం తెచ్చి
అలజడులు దూరంచేసి
సందడిగ  సమయం గడిపేలా
పండుగలా వేడుక నింపే

వేచిన ఉదయానికి

🌸🌸 సుప్రభాతం🌸🌸
కామెంట్‌లు