నేటి నానీలు :- @ నల్లధనం...!- కోరాడ నరసింహా రావు...!
 కోట్ల జన0
   ఆర్ధిక ఇబ్బందుల్లో..! 
 వేలమంది... 
  నల్లధనంతో తిప్పలు.!! 
     *****
వద్దంటే డబ్బు
 కుప్పలు తెప్పలుగా
   దాచుకోలేక 
    అగచాట్లు అరెస్థులు ..! 
       *******
 పేదరిక0లో దేశాలు
  నల్ల ధన0.. 
  లెక్కలేనన్ని కోట్లు
    స్విస్ బ్యా0కులో..! 
     *****
అన్యాయం- అక్రమం
  అపరిమిత ధన0
 పాపం పండితే... 
   జైల్లు - చిప్ప కూళ్లు..! 
    *****
దోచేసి దాచేసుకున్న
  అన్యాయార్జిత0! 
  పాపం పిడుగై... 
   దుఃఖ బాజన0..! 
    ******
లెక్కకు మిక్కిలి
   టాక్సు ఎగ్గొట్టి
 సంపాది0చి0ది
   నల్లధనమై ముక్కిపోతూ
     *******
పేదరిక0 పోవాలంటె
   మూలుగు తున్న
   బ్లాక్ మనీని
  వైట్ చెయ్య0డిసార్..!
       *****
కామెంట్‌లు