అవనియందు సహనశీలి
జగన్మాతగా నిలిచిన పరాశక్తి
అందమైన ప్రకృతిగా అమృతమై
ప్రతి ఇంట వెలుగు పంచు దీపం స్త్రీ
ఇలవేల్పుగా నిలిచిన గృహ లక్ష్మి
మాతృమూర్తిగా మమత పంచి
మగువగా అనురాగం పంచుతూ
మరో జన్మకు జన్మనిచ్చే అద్భుతం స్త్రీ
అమ్మలోని కమ్మదనం పంచుతూ
ఆకలి తీర్చే అన్నపూర్ణ మగువ
వంశాభివృద్ధికి వారధిగా నిలుస్తూ
నయనమై లోకం చూపు మనోహరం స్త్రీ
అన్ని రంగాలలో ప్రతిభ చూపెడుతూ
సహనంలో సముద్రమై నిలుస్తూ
ఆత్మవిశ్వాసమే ఆభరణంగా
మేటైన మానవ మేధస్సు రూపం స్త్రీ
సమాజ నిర్దేశకురాలిగా దిక్సూచి
సులక్షణ సుశిక్షితురాలైన స్ఫూర్తి
అణుకువ మకుటమైన మానవతా
జీవి జీవితానికి జీవన మూలం స్త్రీ
అన్ని తానై అపురూప మణిగా వెలిగే మహిళకు వందనం అభివందనం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి